
సన్నగా పక్కదారి!
నల్లబజార్‌కు తరలుతున్న బియ్యం దందాలో దళారులు, రేషన్ డీలర్లు! అధికారుల తనిఖీలతో వెలుగులోకి.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరని వైనం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రేషన్ దుకాణాల ద్వా రా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని కూడా అక్రమార్కులు వదలడంలేదు. కొన్ని చోట్ల లబ్ధిదారులకు చేరకముందే డీలర్లే బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మరికొన్ని చోట్ల లబ్ధిదారులే అమ్ము కుంటున్నారు. పేదల ప్రయోజనం కోసం ప్రభు త్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమార్కులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీస్, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో ఇవి వెలుగులోకి వస్తున్నాయి.
అంతా ఆన్‌లైన్.. అయితేనేమి?
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నుంచి కొందరు లబ్ధిదారులు నేరుగా దళారులతోపాటు రేషన్ డీలర్లకు అమ్మేసుకుంటున్నారు. ఇందుకు వారు కిలోకు రూ.15వరకు చెల్లిస్తున్నారు. మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే కార్డు తొలగించే అవకాశం ఉండడంతో లబ్ధిదారులు క్ర మం తప్పకుండా తీసుకుంటున్నప్పటికీ పలుచోట్ల దళారులు, రేషన్‌డీలర్లకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన సన్న బియ్యాన్ని అక్రమార్కులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని షాపుల్లో బియ్యం పంపిణీ, ఆన్‌లైన్ కోటా, షాపుల్లోని నిల్వలకు లెక్కలు కుదరడం లేదు. మరోవైపు ఎంఎల్‌ఎస్ (మండల స్థాయి గిడ్డంగి) పాయింట్ల నుంచి తమకు తక్కువ తూకంతో బియ్యం వస్తున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులకు గన్నీ సంచితోనే తూకం వేస్తున్నారు. బియ్యం బస్తాలు ఎత్తి, దింపేటపుడు తరుగుతో పాటు చినిగిన సంచీలతోనూ తమకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంటున్నారు. లబ్ధిదారుల మాదిరిగా డీలర్లకూ బయోమెట్రిక్ అమలవుతోంది. అంటే ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో వేలి ముద్రతోనే బియ్యం పంపిస్తున్నారు. అయితే ఆర్వో (రిలీజింగ్ ఆర్డర్)లో ఉన్న కోటాకు తేడా వస్తోందని చెబుతూ క్షేత్రస్థాయిలో కొందరు డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇటీవలి తనిఖీల్లో..
ఈ నెల 15న జిల్లా కేంద్రంలో పౌరసరఫరాలశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో పాత మంచిర్యాలలో రెండు రేషన్ దుకాణాల డీలర్లు, చున్నంబట్టివాడలో ఒక దుకాణం డీలర్ వారు రాకముందే షాపులు వదిలి పారిపోయారు. దీంతో బియ్యం ని ల్వల్లో తేడాలున్నట్లుగా భావించిన అధికారులు ఆ మూడింటిని సీజ్ చేశారు. గత నెల 12న దండేపల్లి మండలం నంబాలలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7.50 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు జిల్లాలో రేషన్ అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి.
బియ్యం కోటా 4,736.8 మెట్రిక్ టన్నులు (అక్టోబర్)
జిల్లా సమాచారం
కఠినంగా అమలు చేస్తేనే..
సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన మొదట్లో లబ్ధిదారులు అమ్ముకున్నా.. దళారులు, డీలర్లు కొనుగోలు చేసినా కేసులు నమోదు చేశారు. బియ్యం విక్రయించిన లబ్ధిదారుల రేషన్‌కా ర్డుల రద్దుకు సిఫారసు చేశారు. ఆ తర్వాత ప ట్టించుకోవడం మానేశారు. దీంతో యథేచ్ఛగా సన్న బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులతో ఒప్పందం చేసుకుని వారికివ్వాల్సిన బియ్యాన్ని కొని బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎవరైనా లబ్ధి దారులు బియ్యం అమ్ముకుంటే కేసులు నమో దు చేయడంతో పాటు రేషన్‌కార్డులు తప్పనిసరిగా తొలగించాలి. అలాగే బియ్యం నల్లబజా రుకు తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే ప్రజాధనం వృథా కాకుండా అర్హులకే సన్నబియ్యం అందే అవకాశముంది.

సన్నగా పక్కదారి!