ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన కొమ్ము కృష్ణ సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఆదివారం నిర్వహించిన పదవ తెలంగాణ మాస్టర్ ఇంటర్ డిస్టిక్ర్ట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలవడంపై డీవైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పార్థసారథి తదితరులు అభినందించారు.