
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం పనులు, ఆస్తి పన్నుల వసూలుపై సమీక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి ధికారి కిషన్, సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ నియంత్రణలో
భాగస్వామ్యం కావాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: హెచ్‌ఐవీ ఎయిడ్స్ వ్యా ధి నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా హెచ్‌ఐవీ నియంత్రణ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి అనిత, ప్రోగాం అధికారి సుధాకర్‌నాయక్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. డీఎంవో వెంకటేశ్వర్లు, సీహెచ్‌ఓ నామ్‌దేవ్, వైద్యాధికారులు, ఐసీటీసీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.