● ఎట్టకేలకు పంపిణీకి సిద్ధం ● జిల్లాలో 2.25కోట్ల చేప విత్తన లక్ష్యం ● నీటి వనరుల్లో విడుదలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

● ఎట్టకేలకు పంపిణీకి సిద్ధం ● జిల్లాలో 2.25కోట్ల చేప విత్తన లక్ష్యం ● నీటి వనరుల్లో విడుదలకు ఏర్పాట్లు

Oct 18 2025 7:25 AM | Updated on Oct 18 2025 7:25 AM

● ఎట్

● ఎట్టకేలకు పంపిణీకి సిద్ధం ● జిల్లాలో 2.25కోట్ల చేప వి

● ఎట్టకేలకు పంపిణీకి సిద్ధం ● జిల్లాలో 2.25కోట్ల చేప విత్తన లక్ష్యం ● నీటి వనరుల్లో విడుదలకు ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు విడుదలకు రంగం సిద్ధమైంది. గత రెండు సీజన్లుగా ప్రభుత్వ ఉచిత చేప విత్తన పంపిణీ సజావుగా సాగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత సీజన్‌ చేప పిల్లల పంపిణీ బిల్లుల చెల్లింపులు నిలి చిపోవడంతో తదుపరి టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు. కొన్నిచోట్ల ముందుకు వచ్చినా సాంకేతిక కారణాలతో రద్దయ్యాయి. అలా పలుమార్లు పంపిణీపై జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో జిల్లాలో చాలా చోట్ల మత్స్యకారులు సొంతంగా డబ్బులు వెచ్చించి చేపపిల్లలు కొనుగోలు చేసి నీటి వనరుల్లో వదిలారు. జిల్లాలో చెరువులు, కుంటతోపాటు గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు, నీల్వాయి, ర్యాలీవాగు, గొల్లవాగు వంటి మధ్యతరహా నీటి వనరులు ఉన్నాయి. వీటితోపాటు సీజనల్‌గా వర్షాకాలంలో నీరు ఉండే చెరువులు ఉన్నా యి. వీటిలో మత్స్యసంపద పెంచేందుకు 128 మ త్స్యకార సంఘాల్లో 7,500 మంది సభ్యులు ఉన్నా రు. చాలామంది మత్స్యకారులకు మత్స్యసంపద జీవనాధారంగా ఉంది. గత ఏడాది జిల్లాలో మొ త్తం 372 చెరువుల్లో 1.09కోట్ల చేపపిల్లలకు గాను 47 చెరువుల్లోనే 2.99 లక్షల చేపపిల్లలు వదిలారు. పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా ఈ సీజన్‌లో చేపపిల్లల పంపిణీకి టెండరు ఖరారు కావడంతో జిల్లా నుంచే సరఫరాదారులు చేపపిల్లల రవాణా చేసేందుకు అంతా సిద్ధమైంది.

జాప్యంతో ఆందోళన

ఏటా వానాకాలం ఆరంభంలోనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లకు నిండుగా నీరు చేరగానే పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు పంపిణీ పూర్తి చేయాలి. ఈసారి అక్టోబర్‌ నెల పూర్తి కావొస్తున్న సమయంలో చేపపిల్లలు వదులుతున్నారు. దీంతో చేప ఎదుగుదల లేక నష్టపోతామని మత్స్యకారులు వాపోతున్నారు. నిర్ణీత సమయంలో వదిలితే చేప బరువు పెరిగి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. సీజన్‌ దాటిపోవడంతో చేపకు చలి కాలం దాటి ఎండాకాలం వరకు నీటి వనరుల్లో పెరుగుదల కష్టమవుతుందని వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితమే చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రజాప్రతి నిధులు, అధికారుల చేతుల మీదుగా రెండు మూ డు రోజుల్లోనే పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు.

పంపిణీకి సిద్ధం

జిల్లాలో చేపపిల్లల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చేపపిల్లలు నీటి వనరుల్లో వదులుతాం.

– అవినాశ్‌, ఏడీ, జిల్లా మత్స్యశాఖ

● ఎట్టకేలకు పంపిణీకి సిద్ధం ● జిల్లాలో 2.25కోట్ల చేప వి1
1/1

● ఎట్టకేలకు పంపిణీకి సిద్ధం ● జిల్లాలో 2.25కోట్ల చేప వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement