
మద్యం దుకాణాలకు 655 దరఖాస్తులు
మంచిర్యాలక్రైం: కొత్త మద్యం పాలసీ నిర్వహణకు టెండర్ల గడువు శనివారం నాటితో ముగియనుంది. జిల్లాలో 73 దుకాణాలకు గాను శుక్రవారం వరకు 655 దరఖాస్తులు వచ్చాయి. అంచనాకు మించి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులకు నిరాశే ఎదురైంది. నేడు ఒక్క రోజే దరఖాస్తుల సంఖ్య రెండు వేలకు పైగా దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో 73 మద్యం దుకాణాలకు 2,242 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దరఖాస్తు రుసుం పెంచడంతో మద్యం వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి దుకాణాలు దక్కించుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు మాత్రం టెండర్లు అధికంగా వచ్చే విధంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో..
స్టేషన్ దుకాణాలు దరఖాస్తులు
మంచిర్యాల 26 263
లక్సెటిపేట 12 109
బెల్లంపల్లి 25 185
చెన్నూర్ 10 98
మొత్తం 73 655