
పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి
జన్నారం: పెరిగే పిల్లలు, గర్భిణులకు పోషకాహా రం అందించాలని జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) రవూఫ్ ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని టీడీసీలో జన్నారం, దండేపల్లి మండలాల గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ పిల్లల తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. వివిధ రకాల పోషకాహారానికి సంబంధించిన ఫుడ్‌స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. అనంతరం డీడబ్ల్యూవో మాట్లాడుతూ.. పోషకాహారం అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటా రని తెలిపారు. గర్భిణులు పోషకాలు తీసుకుంటే కడుపులోని పిల్లలకు అందుతాయని సూచించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు పరిశీలించి, సుచనలు ఇవ్వాలని తెలిపారు. సీడీపీవో రేష్మా, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఏసీడీపీవో ప్రియదర్శిక, సూపర్‌వైజర్లు పద్మ, దీపవాహిని, కవిత, రమాదేవి, వెంకటలక్ష్మి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ లక్ష్మి, వుమెన్ హబ్ లిప్సిక, విజయ, రెండు మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.