
36 గంజాయి మొక్కలు స్వాధీనం
ఆసిఫాబాద్: జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన సిర్పూర్(యు), జైనూర్‌లో శుక్రవారం 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..సిర్పూర్(యు) మండలం బాబ్జిపేట పంచాయతీ పరిధిలో 32, జైనూర్ మండలం మాన్కుగూడలో 4 గంజా యి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సిర్పూర్(యు) పరిధిలోని గుట్టడూడకు చెందిన పెందూర్ భీమ్‌రావు, కొత్తగూడకు చెందిన కొబాడ చిత్రు, బాబ్జిపేటకు చెందిన కనక లింబా రావుల వద్ద గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. జైనూర్ మండలం మాన్కుగూడకు చెందిన మడావి శ్యాంరావు పత్తి చేనులో 4 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమో దు చేశారు. ఇందులో లింబారావు పరారీలో ఉన్నా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు, నిల్వ, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే డయల్ 100, 8712670551కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎస్సైలు రామకృష్ణ, రవికుమార్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.