
దండారీ సంబురాలు
దండేపల్లి: మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీపద్మల్‌పురి కాకో ఆలయం వద్ద దండారీ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి కాకోను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి కుటుంబ సమేతంగా కాకోను దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు బలిచ్చి అక్కడే వంటలు చేసుకుని పంక్తి భోజనాలు చేశారు. అమ్మవారికి పప్పుగారెలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. గుస్సాడీల నృత్యాలు, దప్పుల దరువులు, కోలాటాల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దండారీ ఉత్సవాల సందర్భంగా రకరకాల దుకాణాలు వెలిశాయి. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.
ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పది
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని వాటన్నింటిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన గుస్సాడీ దర్బార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆలయ అభివృద్దిని గురించి, స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆదివాసీ సంఘాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

దండారీ సంబురాలు

దండారీ సంబురాలు