● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న పక్షి ప్రేమికులు | - | Sakshi
Sakshi News home page

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న పక్షి ప్రేమికులు

Oct 18 2025 7:35 AM | Updated on Oct 18 2025 7:37 AM

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న పక్షి ప్రేమికులు

మామడ: దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నల్దుర్తి తుర్కం, పొన్కల్‌ వెంగన్న చెరువులు ఎకో టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ అందాలను వీక్షించేందుకు అటవీశాఖ అవకాశం కల్పిస్తోంది. గుడారాల విడిది, వాహన సఫారీ ద్వారా చెరువుల అందాలను పర్యాటకులు, పక్షి ప్రేమకులను వీక్షించేలా ఆహ్వానం పలుకుతోంది. ప్రత్యేకంగా ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. ఈక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, శిక్షణలో ఉన్న అధికారులు పర్యటిస్తుండడంతో సందడిగా ఉంటుంది. ఈ చెరువుల వద్ద 80 రకాల పక్షి జాతులను అధికారులు గుర్తించారు. నిర్మల్‌ నుంచి 25 కి.మీ దూరం, దిమ్మదుర్తి నుంచి 4 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంది.

ప్యాకేజీలు ఇలా..

మొదటి ప్యాకేజీ: పిల్లలకు రూ.2వేలు, పెద్దలకు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సందర్శకులు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు తుర్కం చెరువు వద్దకు చేరుకోవాలి. పర్యాటకులకు మధ్యాహ్నం లంచ్‌ అనంతరం సఫారీ నిర్వహిస్తారు. అటవీప్రాంతంలో రాత్రి క్యాంపు ఫైర్‌, డిన్నర్‌ ఏర్పాటు చేస్తారు. పర్యాటకుల బస కోసం ప్రత్యేకంగా గుడారాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం సఫారీ, బర్డ్‌ వాచింగ్‌, అల్పాహారం, చెరువులు, వృక్షజాలాలు చూపించి లంచ్‌ అనంతరం పంపిస్తారు.

రెండవ ప్యాకేజీ: శనివారం సాయంత్రం 4 నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు గడిపిన పర్యాటకులకు పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.1500 చెల్లించాలి.

మూడవ ప్యాకేజీ: శనివారం 6 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఉండేవారికి 10 మంది ఉంటే రూ.600 లేకుంటే ఒక్కొక్కరికి రూ.1000, పిల్లలకు రూ. 300 చెల్లించాలి.

నాలుగవ ప్యాకేజీ: పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సఫారీ ద్వారా అటవీ ప్రాంతాలను చూపిస్తారు. ఇవి కాకుండా కవ్వాల్‌ అ భయారణ్యం వెళ్లాలనుకుంటే పది మందికి రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది. కెమెరా సౌకర్యం కా వాలనుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. w ww. turkamcheruvuaquawings. com వెబ్‌సైట్‌లో పర్యాటకులు బుకింగ్‌ చేసుకోవచ్చు.

సౌకర్యాలు కల్పిస్తున్నాం

తుర్కం, వెంగన్న చెరువులు ఏకో టూరిజం సర్క్యూట్‌లో భాగంగా పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అ మలు చేస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. వారందరికి సౌకర్యాలు కల్పిస్తున్నాం.

– శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఆర్వో, దిమ్మదుర్తి

తుర్కం చెరువు వద్ద బర్డ్‌వాచ్‌ చేస్తున్న పర్యాటకులు

తుర్కం, వెంగన్న చెరువుల వద్ద పక్షులు

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప1
1/4

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప2
2/4

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప3
3/4

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప4
4/4

● పర్యాటకులకు అటవీశాఖ ఆహ్వానం ● అందాలను వీక్షిస్తున్న ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement