
ఎస్సీ బాలుర వసతిగృహం తనిఖీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాకేంద్రంలోని ఎస్సీ కళాశా ల బాలుర వసతిగృహాన్ని శుక్రవారం ఎస్సీ డీడీ చాతరాజుల దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనఖీ చేశా రు. వసతిగృహం పరిసరాలను పరిశీలించారు. వి ద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, స్టోర్‌రూంలో సరుకులు, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువులు, క్రీడల్లో రాణించి ఉద్యోగాలు సాధించాలని వి ద్యార్థులకు సూచించారు. నాణ్యత పరిశుభ్రత పా టించాలని వసతి గృహ సిబ్బందికి ఆదేశించారు. వ సతిగృహ సంక్షేమాధికారి కుమారస్వామి ఉన్నారు.