
పోరాటయోధుడు సూరు
ఉట్నూర్‌రూరల్: పోరాటయోధుడు సూరు అని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా కొనియాడారు. మండలంలోని కొలాంగూడలో కుమురం సూరు వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిర్వహణ కమిటీ సభ్యులు నిర్వహించిన వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. ముందుగా కుమురం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం కుమురం భీమ్‌తో కలిసి పోరాడిన యోధుడు కుమురం సూరు అ ని పేర్కొన్నారు. మహనీయుల చరిత్రను భావితరా లకు అందించాలన్నారు. ఆదివాసీల సంక్షేమం కో సం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ఆదివాసీ, కొలాం మహిళల్లో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు రాగి లడ్డూ అందిస్తామని తెలి పారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉన్నతశిఖరాలు అధిరోహించాలన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రధానమంత్రి జన్‌మన్ పథకం ద్వారా అందిస్తున్న యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ ఈశ్వరిబాయి, రాష్ట్ర అధ్యక్షులు వసంత్, కడప సోనేరావు, పీవీటీజీ ఆదివాసీ రాష్ట్ర ఐక్యవేదిక వ్యవస్థాపకుడు కుడిమేత తిరుపతి, బొంత ఆశారెడ్డి, భీమ్‌రావు, కడప బాపురావు, కుమ్మర రాజు, మడవి రాజేశ్వర్, నిర్వహణ కమిటీ సభ్యులు, కళాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు.