
అటవీ భూముల్లో పట్టుపురుగుల సాగు చేయొద్దు
భీమిని: అనధికారికంగా అటవీ భూముల్లో పట్టు పురుగుల సాగు చేయొద్దని కుశ్నపల్లి రేంజ్ అధికారి దయాకర్, లింగాల ఎఫ్‌బీవో రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండలం లింగాల గ్రామ పంచాయతీ పరిధిలో పట్టు పురుగులు సాగు చేస్తున్న గిరిజన రైతులతో మాట్లాడి అవగాహన కల్పించా రు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లోని చెట్లపై పట్టు పురుగులు సాగు చేయవద్దని సూచించారు. ఉన్నత అధికారుల నుంచి అటవీ భూముల్లో సాగుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అటవీ భూ ముల్లో పట్టు సాగు చేస్తే అటవీశాఖ పరంగా చట్టరీ త్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.