
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి
మందమర్రిరూరల్: మందమర్రి శివారు మేడారం జాతీయ రహదారికి కూతవేటు దూరంలో 364 సర్వే నంబర్‌లో 1.30 ఎకరం ప్రభుత్వ భూమిని గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కోరా రు. జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు శుక్రవారం వినతిపత్రం అందించారు. ప్రభుత్వ భూమిలో కొందరు రియల్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించగా అక్కడ నిర్మాణాలు కూడా జరిగాయని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు నాగుల కిరణ్‌బాబు, దాగం శ్రీనివాస్ ఉన్నారు.