
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
బెల్లంపల్లిరూరల్: పౌష్టికాహారం ప్రతీ రోజు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా సంక్షే మ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ అన్నారు. గురువారం మండలంలోని గురిజాల రైతువేదికలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆకుకూరలు, పప్పుదినుసులు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలకలు ఐసీ డీఎస్ ద్వారా అందిస్తున్న సేవలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. గ్రామీణులకు ఐసీడీఎస్ సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం చి న్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు చీరసారెలు అందజేశారు. సీడీపీవో స్వరూపరాణి, తాళ్లగురిజాల పీహెచ్‌సీ వైద్యాధికారి ఇవాంజలీన్, పోషణ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ రజిత, డీపీఏ శ్యామల, మహిళా హబ్ జిల్లా కో–ఆర్డినేటర్ సౌజన్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.