
ఏరియా ఆసుపత్రిలో తనిఖీ
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కోటేశ్వర్ గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభా గాల వార్డులు, లేబర్ రూమ్‌లు, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, రికార్డులు పరిశీలించా రు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. రోగులకు సరైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూ చించారు. ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జోస్పిన్, జూనియర్ అసిస్టెంట్ అనిల్‌కుమార్, ల్యాబ్‌టెక్నీషియన్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.