
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా మంజూరు చేయాలని మందమర్రికి చెందిన అమృత, ఉపాధి కల్పించాలని నార్నూర్ మండలం భీంపూర్‌కు చెందిన తిరుపతి, ఉమ్రికి చెందిన సునీల్ ఎంబీబీఎస్ చదువులకు ఫీజు మంజూరు చేయాలని, ఆసిఫాబాద్‌కు చెందిన సువర్ణ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, గాదిగూడ మండలం రాయిగూడకు చెందిన ఆత్రం సునీబాయి సోలార్ యూనిట్ ఇప్పించాలని కోరారు. అనంతరం పీవో ఈ నెల 17 నుంచి గుడిరేవులో గల ఆదివాసుల ఆరాధ్య దైవం పద్మల్ పూరి కాకో ఏత్మాసూర్ ఆలయ ప్రాంగణంలో జరగనున్న గుస్సాడీ, దండారీ, దర్బార్ ఉత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు.