
కబడ్డీ జట్టుకు ఘన స్వాగతం
మంచిర్యాలఅర్బన్: ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు క్రీడాకారులకు సోమవారం మంచిర్యాలలో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 10 నుంచి 12 వరకు మహబూబాబాద్ జిల్లాలోని కొమ్ములవంచలో నిర్వహించిన పోటీల్లో మహబూబ్‌నగర్ (ప్రథమ) మెదక్ (ద్వితీయ) స్థానంలో నిలవగా ఆదిలాబాద్ జట్టు తృతీయ స్థానం సాధించింది. ప్రతిభ కనబరిచి మంచిర్యాలకు వచ్చిన జట్టు సభ్యులు, కోచ్ మేనేజర్లు సాంబమూర్తి, రాజన్న, సుదీప్‌లను మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో అభినందించారు. కార్యక్రమంలో డీఐఈవో అంజయ్య, పాఠశాల, కళాశాల గేమ్స్ కార్యదర్శి బాబురావు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు రాంచందర్, కార్తీక్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.