
రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి
రెబ్బెన: సెపక్ తక్రా ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించాలని సెపక్‌తక్రా జిల్లా కన్వీనర్ కుమ్మరి మల్లేశ్ అన్నారు. బుధవారం మండలంలోని గోలేటిటౌన్‌షిప్‌లో సెపక్ తక్రా ఉమ్మడి జిల్లా అండర్ 14, అండర్ 19 జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన వారు ఈనెల 10 నుంచి 12 వరకు గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు భాస్కర్, ఏరియా స్పోర్ట్స్ సూపర్‌వైజర్ అశోక్, జనరల్ కెప్టెన్ కిరణ్, సీనియర్ క్రీడాకారులు నరేశ్, పీడీ తిరుపతి, రాకేశ్, గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న జిల్లా జట్లు..
అండర్ 14 సబ్ జూనియర్స్ జిల్లా బాలుర జట్టుకు జి. శివకుమార్, బి. కన్నయ్య, జి. శివచరణ్, సీహెచ్ హరీశ్, ఎస్.సాయిచరణ్, అదనపు క్రీడాకారుడిగా బి. అభిలాష్‌లు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో టి. హాసిని, ఎస్.అక్షర, కే.దర్శిని, కే.శ్రీవల్లి, వి.అఖిల, అదనపు క్రీడాకారిణిగా బి. కౌసల్యను ఎంపిక చేశారు.
అండర్ 19 విభాగంలో..
సెపక్ తక్రా ఉమ్మడి జిల్లా అండర్ 19 బాలుర జట్టులో కే. రామ్‌చరణ్, సీహెచ్.శ్రీకాంత్, కార్తీక్, అజిత్, విక్రమ్, అదనపు క్రీడాకారుడిగా దీపక్‌లను ఎంపిక చేయగా, బాలిక జట్టులో కే. అభినయ రమ్యశ్రీ, జే.రక్షిత, ఏ.సానియా, ఆర్.సలోనీ, ఎం.యాసశ్రీ, అదనపు క్రీడాకారిణిగా ఏ. కీర్తీ, సీహెచ్. రూపాలిలు చోటు దక్కించుకున్నారు.