
బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి
మంచిర్యాలక్రైం: బాణాసంచా దుకాణాల్లో ని బంధనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లాలోని లైసెన్స్‌డ్ టపాసుల నిర్వాహకులతో పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాలులో ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసులు కొనడానికి మహిళలు, చిన్నపిల్లలు పెద్దమొత్తంలో వస్తుంటార ని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పా టించాలని సూచించారు. మంచిర్యాల డిగ్రీ కళాశాల, నస్పూర్ గ్రౌండ్‌లో దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, ఇంచార్జి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.