
రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య
తలమడుగు: మండలంలోని ఉండం గ్రామానికి చెందిన హర్షముత్తుల వెంకటి (40) గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటికి గతంలో ప్రమాదంలో కాలు విరగగా ఏ పనీ చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్ర మంలో మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల క్రితం బైక్‌పై గ్రామానికి చెందిన పోశెట్టిని ఢీకొ ట్టాడు. ఈ ప్రమాదంలో పోశెట్టి కాలు విరగడంతో పోలీస్‌స్టేషన్‌లో వెంకటిపై కేసు నమోదైంది. దీంతో జీవితంపై విరక్తితో శుక్రవారం గ్రామశివారులో ఆదిలాబాద్ వైపు వస్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ తెలిపారు.