
దాడి ఘటనలో నిందితులపై కేసు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా వద్ద గురువారం ఇద్దరు యువకుల పై విచక్షణా రహితంగా కొందరు దాడి చేసి గాయపర్చారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సర్కిల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్‌తో కలిసి ఆయన వివరాలు వెల్ల డించారు. పాలచెట్టు ఏరియాలో ఉన్న పచ్చిక రవితేజ, బండ రాకేశ్‌కు స్థానిక విద్యానగర్‌కు చెందిన కొందరు యువకులకు ఆటో యూ టర్న్ తీసుకునే విషయంలో ఘర్షణ ఏర్పడింది. ఆటోలో వచ్చినవారు విచక్షణారహితంగా ఇద్దరు యువకులపై తాగిన మైకంలో చేతులు, కర్రలు, రాళ్లతో దాడి చేయగా రవితేజ తలకు గాయమైందని సీఐ తెలిపారు. రవితేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన జిల్లపల్లి ఆకాశ్, కోట మహే శ్, రెండ్ల శ్రీకాంత్, వానబోయిన నవీన్‌కుమార్, పులి సతీశ్, మరొకరు జిల్లపల్లి ఆకాశ్ స్నేహితుడిపై కేసు మోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఆకాశ్ స్నేహితుడు ప రారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే పీడీ యాక్ట్ న మోదు చేయడానికై నా వెనుకాడమని హెచ్చరించారు.