
‘బాసర’ సేవా టికెట్లపై వివరాలేవి?
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు టికెట్ కౌంటర్‌లో సోమవారం రూ.100 దర్శనం టికెట్లు నాలుగు కొనుగోలు చేశాడు. అయితే టికెట్లపై భక్తుల పేరు, ఊరు, తేదీ తదితర వివరాలు నమోదు చేయలేదు. దీంతో ఒకసారి విక్రయించిన టికెట్‌ను మళ్లీ అ మ్మేందుకే ఇలా వివరాలు రాయడం లేదని పలువు రు భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో రూ.వెయ్యి ప్రత్యేక అక్షరాభ్యాస టికెట్‌పై భక్తుడి వివరాలు రాయకుండా దానిని మళ్లీమళ్లీ విక్రయింగా గుర్తించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇలాంటి చర్యలు పునరావృత కాకుండా చూడాలని కోరుతున్నారు.