
టిప్పర్, హైడ్రా వాహనం ఢీ
నస్పూర్: పట్టణ పరిధిలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై టిప్పర్ వాహనాన్ని హైడ్రా వాహనం ఢీకొట్టింది. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ వైపు వస్తు న్న హైడ్రా వాహనం కలెక్టరేట్ చౌరస్తా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీని ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఢీకొట్టింది. హైడ్రా వాహనం ముందు భాగం టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌పై పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.