
నేరడిగొండలో రెండిళ్లలో చోరీ
● 3 తులాల బంగారం, రూ.70వేల నగదు అపహరణ
నేరడిగొండ: మండల కేంద్రంలో మథుర కాలనీలోగల రెండిళ్లలో మంగళవారం తెల్లవారుజా మున దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ జావిద్ కుటుంబ స భ్యులు 15రోజుల క్రితం మహారాష్ట్రలోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండగా వారి ఇంట్లో దొంగలు చొరబడి మూ డు తులాల బంగారం, రూ.40వేల నగదు దో చుకెళ్లారు. మహ్మద్ సోఫీ కుటుంబ సభ్యులు, వారి బంధువుల ఇంటికి వెళ్లగా వారి ఇంట్లోనూ చోరీకి పాల్పడి రూ.30వేల నగదు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.