
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: అటవీ ఉత్పత్తులు, పోడు సాగు పై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఆర్థికంగా, రా జకీయంగా వెనుకబడిన పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమానికి పీవీటీజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొలాం సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పలువురు మాట్లాడారు. అనేక ఆదివాసీ కొలాం గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పీవీటీ జీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ఎ లాంటి నిబంధనలు లేకుండా సీట్లు కేటాయించా లని కోరారు. పోరాట యోధుడు కుమ్రం సూరు జయంతి వేడుకల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొలాం సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొడప సొనేరావు, ప్రధాన కార్యదర్శిగా సిడాం రాజు, ఉపాధ్యక్షునిగా కుమ్ర రాజు, గౌ రవాధ్యక్షుడిగా టేకం లక్ష్మణ్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలిగా కుమ్ర లక్ష్మీబాయి ఎన్నికయ్యా రు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను శా లువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్‌రావ్, నాయకులు కొడప రాము, టేకం గణేశ్, మడావి జంగు ఉన్నారు.