
యూరియా తరలిస్తున్న ప్రధాన నిందితుడి అరెస్ట్
జైనథ్ : ఈనెల 8న రెండు వాహనాల్లో 150 యూరియా బస్తాలను మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసి బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన సునీల్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను ముఠాగా ఏర్పడ్డ కొందరు అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారన్నారు. ఈ ముఠాలో కీలక సభ్యుడైన హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రొప్రయిటర్‌ను అదుపులోకి తీసుకుని రెండు వాహనాలను సైతం సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠాలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.