
గ్రామాల్లో ‘ఎకై ్సజ్’ గ్రామసభలు
ఉట్నూర్‌రూరల్: మండలంలోని ఉట్నూర్, లింగోజీతండా, లక్కారం, హర్కాపూర్ గ్రామాల్లో ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత గ్రామపంచాయతీల ప్రత్యేకాధికారి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. పరిశీలకులుగా మెస్రం మనోహర్, ఏటీడీవో క్రాంతి వ్యవహరించా రు. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామపంచాయతీల్లో వై న్‌షాపుల ఏర్పాటుకు తీర్మానాలు చేసినట్లు ప్రత్యేక పరిశీలనాధికారి మనోహర్ తెలిపారు. ఉమ్మడి జి ల్లాలోని తొమ్మిది ఏజెన్సీ గ్రామాలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఐదు గ్రామాలను కలుపుకొని 14 గ్రామపంచాయతీల్లో ఈ నెల 25, 26 తేదీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎ క్సైజ్ ఉట్నూర్ బ్రాంచ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రూప్‌సింగ్, ఎస్సై కష్ణకుమార్, అధికారులు పాల్గొన్నారు.