
ఆర్జీయూకేటీ విద్యార్థులకు అవగాహన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో నూతన ఆవిష్కరణల పరిరక్షణకు మార్గనిర్దేశం చే యడమే లక్ష్యంగా ‘అవగా హన మేధస్సుకు రక్షణ’ అ నే అంశంపై కళాశాల అధి కారులు ఇంజినీరింగ్ విద్యార్థులకు శుక్రవారం అవగా హన కల్పించారు. కార్యక్రమంలో పేటెంట్ దాఖలాలు, కాపీరైట్స్, డిజైన్ రిజిస్ట్రేషన్, పేటెంట్ డ్రాఫ్టింగ్ తదితర ముఖ్యాంశాలపై డాక్టర్ దాసరి అయోధ్య వివరించారు. డాక్టర్ సాజిబ్ కేఏ పాల్ మాట్లాడుతూ.. మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), భారతదేశ ఐపీ చట్టాలు, ఐపీఆర్ ప్రధాన విభాగాల గురించి తెలిపారు. సమాచారం, దరఖాస్తు ఫారాల రకాలు, దరఖాస్తును వేగంగా ప్రాసెస్ చేసుకునే వ్యూహాలు, ఫీజు నిర్మాణాల గురించి వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేటెంట్ల కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలో తెలిపారు. పేటెంట్ శోధనలు ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేశారు. డ్రాయింగ్, సాంకేతికంగా ఎలా రాయాలో, ఎలా రూపొందించాలో అవగాహన కల్పించారు. భారతదేశం డబ్ల్యూటీవో (ప్రపంచ వాణిజ్య సంస్థ) స్థాపక సభ్యులుగా ఉన్నప్పటికీ దేశంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో ట్రేడ్, ఆవిష్కరణలపై ప్రత్యేక కో ర్సులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశా రు. తెలంగాణ ఉత్పత్తులకు మార్కెట్లో గుర్తింపు లేని దుస్థితి ఉందని తెలిపారు. సెమీ కండక్టర్ ఉత్పత్తుల ప్రాధాన్యత, ఫ్యాన్సీ ఐస్‌క్రీమ్‌లు, కుకీస్ ప్యాకేజింగ్ మార్కెటింగ్, ఐపోస్, అలెక్సా ఆధారిత హోటల్, స్మార్ట్ లైటింగ్ లాంటి అనేక వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. త్వరలో విశ్వవిద్యాలయంలో ఇంక్యూబేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు కళాశాల వీసీ గోవర్ధన్ ప్రకటించారు. ‘ఉత్పత్తుల అభివృద్ధి, మార్పుల ఆవశ్యకతలు, మార్కెట్ డిమాండ్లను గమనిస్తూ మార్పులు చేయగల సామర్థ్యం కలిగిన మేధావులను సిద్ధం చేయాలని సూచించారు. అసో సియేట్ డీన్‌లు డాక్టర్ విఠల్, డాక్టర్ మహేశ్, కోఆర్డి నేటర్ డాక్టర్ కాశన్న, సభ్యులు డాక్టర్ అజయ్ రెవెల్లి, డాక్టర్ రాకేశ్ రోషన్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీ విద్యార్థులకు అవగాహన