
తొమ్మిది కిలోమీటర్లు నడిచి వైద్యసేవలు
ఇచ్చోడ: మండలంలోని నర్సాపూర్ పీహెచ్‌సీ హెల్త్‌అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్‌ఎం రేణుక శుక్రవారం మారుమూల గిరిజన గ్రామాలైన బుర్సిగుట్ట, ధర్మాజీపేట్‌కు సుమారు తొమ్మిది కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. ఆయా గ్రా మాల ప్రజలకు వైద్యం అందించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మరో తొమ్మిది మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, చేతిపంపుల నీరే తాగాలని సూచించారు.