రైతన్నా.. జర భద్రం | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. జర భద్రం

Jul 26 2025 9:24 AM | Updated on Jul 26 2025 9:54 AM

రైతన్నా.. జర భద్రం

రైతన్నా.. జర భద్రం

● రసాయనిక ఎరువులతో జాగ్రత్త ● పిచికారీలో జాగ్రత్తలు తప్పనిసరి ● నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయమే ● అప్రమత్తతే అన్ని విధాలా మేలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పురుగుమందులంటేనే అత్యంత ప్రమాదకరమైనవి. అవి మన శరీరంలోకి వెళ్లినా.. వాటి వాసన పీల్చినా ఆరోగ్యానికి హానికరమే. పంటలపై పురుగుమందులు పిచికారీ చేయడంలో అవగాహన లేకపోవడం.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రైతులు, వ్యసాయ కూలీలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతేడాది పంటకు పురుగుమందు పిచికారీ చేసి ఇంటికి వచ్చి విషప్రభావంతో వే ర్వేరు చోట్ల నలుగురు మరణించారు. వేర్వేరు ఘ టనల్లో మరో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు ప్రతీ సీజన్‌లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం పత్తి, సోయా, కంది చేన్ల కు కలుపు, చీడపీడల నివారణకు రసాయనిక మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు హాని జరుగుతుందన్న ఏమరుపాటులో రైతులు, వ్యవసాయ కూలీలు వ్యక్తిగత జాగ్రత్తలు మరిచిపోతున్నారు. ప్రాణాంతకమైన రసాయనిక మందుల వినియో గం విషయంలో ఏమరుపాటు వద్దని ఆదిలాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రాజశేఖర్‌ తెలిపారు. పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే మేలని సూచించారు.

మందు ప్రభావానికి గురైతే..

ఫ పురుగుమందు ప్రభావానికి గురైన వ్యక్తి నోట్లో వేలు పెట్టి వాంతి చేయించాలి.

ఫ మూర్చపోయిన సందర్భంలో మూతికి గాయం కాకుండా రెండు దవడల మధ్య గుడ్డ ఉంచాలి.

ఫ శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో నెమ్మదిగా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. అనారోగ్యానికి కారణమైన రసాయనాల వివరాలు డాక్టర్‌కు తెలుపాలి.

అవసరమైన పరికరాలు వాడాలి

పంటలకు పురుగుమందులు వాడడానికి వ్యవసాయశాఖ సూచించిన స్ప్రేయర్లనే వాడాలి. ముఖ్యంగా పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రేయర్లు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్‌ స్ప్రేయర్‌, పవర్‌ స్ప్రేయర్ల కంటే తైవాన్‌ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది.

పరిమితికి మించి వద్దు

పంటను ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన మందులు చల్లితే ఉపయోగం ఉండదు. విష తీవ్రతలో తేడా ఉంటుంది. పిచికారీ చేసేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అస్వస్థతకు గురవుతారు. వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు ఫెస్టిసైడ్స్‌ దుకాణాదారులు సూచనలు పాటించాలి. పరిమితికి మించి పంటలకు మందులు పిచికారీ చేస్తే మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. జాగ్రత్త వహించకుంటే పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు మృత్యువాత పడతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల ఉధృతి పెరుగుతుంది.

అవగాహన అవసరం

పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతుల అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఫెస్టిసైడ్‌ దుకాణాల్లో పురుగుమందులు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిలో పుర్రె గుర్తుతో ఉన్న రంగు, ఆకుపచ్చ, నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలుంటాయి. పుర్రె గుర్తుతో కూడి ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని తెలుసుకోవాలి.

ఫ పురుగు మందు డబ్బా మూత నోటితో తీయవద్దు. మందు ద్రావణాన్ని చేతితో కలపద్దు.

ఫ మందు ఒకేసారి సరిపడా కలుపుకోవాలి.

ఫ పపర్‌ స్ప్రేయర్‌ నాజిల్‌ను పెద్దగా చేయరాదు. పిచికారీ సన్నగా, తుంపరలా ఉండేలా చూడాలి.

ఫ మందు తగిన మోతాదులోనే పిచికారీ చే యా లి. మోతాదుకు మించితే పంటలకు ప్రమాదం.

ఫ ఒకేసారి రెండు లేదా మూడు రాకల పురుగుమందులు కలిపి పిచికారీ చేయకూడదు.

ఫ చేతులకు గ్లౌస్‌లు, కళ్లద్దాలు, ముఖానికి మాస్క్‌, తలకు టోపీ లేదా రుమాలు తప్పనిసరిగా ధరించాలి. చేతి వేళ్లకు గోళ్లు పెంచుకోకూడదు. పత్తిలో అయితే కాళ్లకు బూట్లు ధరించాలి.

ఫ ఉదయం, సాయంత్రం గాలి ఎదురుగా వచ్చేటప్పుడు పురుగుమందు పిచికారీ చేయకూడదు. గాలి వీస్తున్న వైపే వెళ్తూ పిచికారీ చేయాలి.

ఫ పురుగుమందు పిచికారీ చేసే సమయంలో పొగ తాగరాదు. పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు తిన వద్దు. చేతులు నోట్లో పెట్టుకోవడం, కళ్లు నలుచుకోవడం లాంటి పనులు అస్సలు చేయొద్దు.

ఫ పంట ఏపుగా పెరిగి ఉంటే చేతిపంపుతో కాకుండా స్ప్రేయర్‌తోనే పిచికారీ చేయాలి.

ఫ కొన్ని రకాల పురుగుమందులు మాత్రం పవర్‌ స్ప్రేయర్‌తో పిచికారీ చేయకూడదు. స్ప్రేయర్‌తో పిచికారీ చేస్తే మందు గాలిలో కలిసి ఇతర పంట లపై పడితే పంట నాశనమై పోతుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి.

ఫ గాయాలైన చేతులతో మందు పిచికారీ చేయరాదు. పిచికారీ పూర్తియిన వెంటనే కాళ్లు, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. తలస్నానం చేయాలి.

ఫ పిచికారీ చేసేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు మాత్రమే ధరించాలి. వాటిని విడిచిన తర్వాత మిగతా దుస్తులతో కలిపి శుభ్రం చేయొద్దు.

ఫ చిన్నపిల్లలకు పురుగుమందులను సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త పడాలి.

ఫ పిచికారీ అనంతరం వినియోగించిన పురుగు మందు డబ్బాలను గోతి తీసి పాతిపెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement