గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

Jul 25 2025 4:55 AM | Updated on Jul 25 2025 4:55 AM

గల్లం

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని ఖండాల జలపాతంలో బుధవారం గల్లంతైన మనోహర్‌ సింగ్‌ (17) మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌ కాలనీలో నివాసముంటున్న పర్మార్‌ దొంగల్‌సింగ్‌, జెడియాకవర్‌ దంపతుల పెద్ద కుమారుడు మనోహర్‌ సింగ్‌ ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా ఖండాల జలపాతానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ప్రమాదవశా త్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గురువారం ఉద యం గజ ఈతగాళ్లతో గా లింపు చేపట్టి మృతదేహా న్ని బయటకు తీశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

డ్రెయినేజీలోపడి వృద్ధుడు మృతి

బాసర: బాసర బస్టాండ్‌ సమీపంలోని డ్రెయినేజీలో పడి ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. కుభీర్‌ మండలంలోని సావ్లి గ్రామానికి చెందిన గంగ సముద్రవార్‌ ఎల్లప్ప(60) పన్నెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి బాసరకు వచ్చాడు. చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న ఎల్లప్ప బుధవారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. గురువారం ఉదయం డ్రెయినేజీలో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి..

భీమిని: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దపేట గ్రామానికి చెందిన వశాఖ పోసుమేర (49) గురువారం ఇంట్లో ఉన్న కూలర్‌ను తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురై ఎగిరిపడ్డాడు. గమనించిన అతని భార్య నానుబాయి లేపే ప్రయత్నం చేస్తుండగా ఆమె సైతం షాక్‌కు గురైంది. వెంటనే గమనించిన వారి కోడలు కరంట్‌ ఫ్లగ్‌ తీసివేయడంతో నానుబాయికి ప్రాణాపాయం తప్పింది. పోసుమేరను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. నానుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు.

లారీ ఢీకొని ఒకరు..

గుడిహత్నూర్‌: మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన తిడ్కే భానుదాస్‌ (80) మృతి చెందగా, వరుసకు సోదరుడైన బోదిడి (కే) గ్రామానికి చెందిన గుట్టే బాబారావు తీవ్రగాయాలపాలయ్యాడు. బాధితుల బంధువులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వరుసకు సోదరులైన భానుదాస్‌, బాబారావు గురువారం కిన్వట్‌ నుంచి గుడిహత్నూర్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి బైక్‌పై బయలుదేరారు. స్థానిక బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఆదిలాబాద్‌ వైపు వేగంగా వెళ్తున్న కంటైనర్‌ లారీ బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. బైక్‌ నడుపుతున్న బాబారావుకు తీవ్రగాయాలుకాగా భానుదాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై దిలీప్‌ తెలిపారు.

మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి..

బంధువులను కలవడానికి వచ్చిన సోదరులు మరో రెండు నిమిషాల్లో వారి గమ్యస్థానానికి చేరే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భానుదాస్‌ బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

పాముకాటుతో మహిళ..

మందమర్రిరూరల్‌: మందమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల తుర్కపల్లికి చెందిన మంద శ్రీలత (30) పాముకాటుతో మృతి చెందింది. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు శ్రీలత బుధవారం తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లగా పాము కాటువేసింది. విషయాన్ని తన భర్తకు చెప్పడంతో 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త రాజు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

యువతిని దూషించిన వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని అటెండర్‌ కాలనీకి చెందిన యువతిని వాట్సాప్‌లో అసభ్యకరంగా దూషించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. మహారాష్ట్రలోని పాఠన్‌కు చెందిన గొంటిముక్కుల కిరణ్‌ వాట్సాప్‌లో చాటింగ్‌ చేసి యువతిని ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు జూన్‌ 6న ఫిర్యాదు చేయగా గురువారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం1
1/3

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం2
2/3

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం3
3/3

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement