
ఆర్జీయూకేటీలో గ్లోబల్ కోటా ఫీజుపై కౌన్సెలింగ్
బాసర:ఆర్జీయూకేటీలో బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో గ్లోబల్ కోటా కింద సీట్లు పొందే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుపై వారి తల్లిదండ్రులకు బాసర ట్రిపుల్ ఐటీలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందే విధానం, అందుబాటులో ఉన్న కోర్సులు, విద్యా విధానం, సీట్లు, ఫీజు విధానం, క్యాంపస్ వసతులను వివరించారు.
నకిలీ ‘ఆధార్’ తయారు చేస్తున్న ఒకరి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన చరణ్‌సింగ్, సందీప్ పట్టణంలోని భాగ్యనగర్, క్రాంతినగర్‌లో స్థానిక ఆధార్ కార్డులు, ఇతర నకిలీ ఐడీ ప్రూఫ్‌లను తయారు చేసి మధ్యప్రదేశ్‌కు చెందిన తమ సంబంధీకులకు పంపిస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈవిధంగా పాల్పడుతున్నట్లు చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారించగా ఈ విషయం బయటపడింది. చరణ్‌సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, సందీప్ పరారీలో ఉన్నట్లు వివరించారు.