
వనమహోత్సవంతో పచ్చదనం విస్తరించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వన మహోత్సవం కార్యక్రమంతో పచ్చదనం విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి (చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్) ఏలుసింగ్ మేరు అన్నారు. లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాత మంచిర్యాల అటవీ బీట్‌లో గల గాంధారీ ఖిల్లా జంగల్ సఫారీలో ఆదివారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పచ్చదనం విస్తరించడంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. రాష్ట్ర ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎస్.శాంతారాం, జిల్లా అటవీ శాఖాధికారి టి.శివ్‌ఆశిశ్ సింగ్ పాల్గొన్నారు.