కుంటాల: కొత్త ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేనన్న బెంగతో మద్యానికి బానిసై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని విఠాపూర్‌కు చెందిన వెంగళం సాయినాథ్(38) పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కల్లూరు గ్రామానికి వచ్చి వడ్రంగి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కల్లూరులో సొంత ఇంటి నిర్మాణ కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. అప్పులు ఎలా తీర్చేదనని మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి కొత్త ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం సాయినాథ్ చిన్న కుమారుడు ఆడుకుంటూ వంటగదికి వెళ్లగా తండ్రి విగతజీవిగా శవమై కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
పురుగుల మందు తాగి
యువకుడు..
కుభీర్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పార్డి(కె) గ్రామానికి చెందిన మెటిపల్లి శ్రీనివాస్(32)–గంగాసాగర దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస్ హైదరాబాద్‌లో 108లో పనిచేసేవాడు. గత 15రోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. శ్రీనివాస్ స్వగ్రామమైన పార్డి(కె)కు వచ్చాడు. అప్పటి నుంచి మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం రాత్రి గ్రామశివారులోని రేకుల షెడ్డులో మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లక్ష్మీపూర్‌లో వివాహిత..
సిరికొండ: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వివాహిత గురుజల చిట్టి శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్‌కు 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
మద్యానికి బానిసై వృద్ధుడు..
తానూరు: మద్యానికి బానిసై వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని భోసి గ్రామానికి చెందిన చిక్కల్‌వార్ సురేశ్ (60) టైలరింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా అనారోగ్యం బారినపడి వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతని భా ర్య గంగాసాగర అనారోగ్యం పాలైంది. ఈక్రమంలో సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. తన భార్య, తాను అనారోగ్యం బారినపడడంతో మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి మహాలింగి రోడ్డుకు ఉ న్న గుట్ట ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. అక్కడ ఉన్న కొందరు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని అతన్ని భైంసా ఆస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో ఆదివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి నలు గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య