
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
సోన్: పురుగుల మందు తా గిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తమ్మిశెట్టి శ్రీను(34) బతుకుదెరువు కోసం లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామానికి వచ్చి కొన్నినెలలుగా తాీ పమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. గ్రామంలో నూతన ఇళ్ల నిర్మాణం చేపట్టాడు. పట్టుకున్న ఇళ్లను పూర్తి చేయలేక, కూలీలు దొరకక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మనస్తాపం చెందాడు. శనివారం సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామ శివారు సరస్వతీ కెనాల్ సమీ పంలో గుర్తుతెలియని పురుగు ల మందు తాగాడు. స్థానికులు గమనించి అతన్ని ప్రభుత్వాసుపత్రికి త రలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆ సుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ ఆది వారం మృతి చెందాడు. భార్య శిరీష ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గో పి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హైదరాబాద్ నిమ్స్‌లో రైతు..
భీమారం: ఎడ్లబండిపై నుంచి జారి కిందపడ్డ గాయపడిన రైతు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని లాల్‌బహుదూర్‌పేటకు చెందిన రైతు కంకణాల మల్లారెడ్డి ప్రతిరోజు మాదిరి ఈనెల 15న పొలం వద్దకి ఎడ్లబండిపై వెళ్తుండగా అకస్మాత్తుగా జారి కిందపడి గా యాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు సతీశ్, కుమార్తె మానస ఉన్నారు.

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి