
అ‘పూర్వ’ సమ్మేళనం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం దొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991–92వ బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 33 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి ఆ పాఠశాల వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివి వ్యాపారాలు, ఉద్యోగాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా అపూర్వ సమ్మేళనంతో కలిసి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో ఆనంద క్షణాలు పంచుకున్నారు. పాఠశాల హెచ్‌ఎం హన్మాండ్లు, ఉపాధ్యాయులు రాములు, సత్యనారాయణ, రాజ్‌కుమార్, పూర్వ విద్యార్థులు బేతి శ్రీనివాస్, గుండ లచ్చయ్య, జాడి విజయ్, చంద్రశేఖర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.