
సెలవుల్లో ఇంటికి వచ్చి మృత్యుఒడిలోకి
● బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
దండేపల్లి: హోంసిక్ సెలవుల్లో ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని నంబాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం..లక్సెట్టిపేటకు చెందిన రుద్ర వంశీకృష్ణ(16) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. హోంసిక్ సెలవుల్లో భాగంగా శనివారం లక్సెట్టిపేట ఇంటికి వచ్చాడు. దీంతో ప ల్లెలోని పంట పొలాలు చూసేందుకు ఆదివారం తె ల్లవారు జామున స్నేహితులతో కలిసి బైక్‌లతో గూ డెం–మేదరిపేట రింగురోడ్డు గుండా బయల్దేరారు. నంబాల సమీపానికి చేరుకోగా, వంశీకృష్ట స్కూటీ రోడ్డుపక్కన ఉన్న మట్టికుప్పను ఢీకొట్టి పక్కనున్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయా డు. ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. స్కూటీ వెనకాల కూర్చుని ఉన్న స్నేహితుడు వర్షిత్‌వర్మ మట్టికుప్పపై పడటంతో గాయాలయ్యాయి. వెనకాల మరో బైక్‌పై వస్తున్న మిగతా మిత్రులు ఈ విషయాన్ని గమనించి కు టుంబసభ్యులకు సమాచా రం అందించారు. వా రంతా ఘటన స్థలానికి చే రుకున్నారు. మృతుడి తల్లి నా గమణి ఫిర్యాదుతో కేసు ద ర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల ్లడించారు. కాగా, వంశీతోపాటు మరికొంతమంది మిత్రులు బైక్ రేస్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పది నెలల క్రితం గుండెపోటుతో తండ్రి..
వంశీకృష్ణ తండ్రి రవికుమార్ కారు మెకానిక్‌గా పనిచేస్తూ, పది నెలల క్రితం గుండెపోటు మృతిచెందాడు. ఇప్పుడు అతని చిన్న కొడుకు వంశీకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోవడంతో ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. పది నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. సెలవులు రాకపోయిన బతికేటోడని కుటుంబీకులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.