● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● ఆసక్తి చూపని లబ్ధిదారులు ● మంజూరులో సగం కూడా ప్రారంభించని వైనం ● త్వరగా పూర్తి చేయాలంటున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● ఆసక్తి చూపని లబ్ధిదారులు ● మంజూరులో సగం కూడా ప్రారంభించని వైనం ● త్వరగా పూర్తి చేయాలంటున్న అధికారులు

Jul 21 2025 7:49 AM | Updated on Jul 21 2025 7:49 AM

● ఇంద

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● ఆసక్తి చూపని లబ్ధ

మంచిర్యాలటౌన్‌: ఇంటి స్థలం ఉండి ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో మంజూరైన ఇళ్లలో కనీసం సగం కూడా గ్రౌండింగ్‌ కాలేదు. కొందరు బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు పూర్తి చేసి మొదటి విడత ప్రభుత్వ సాయం పొందిన తరువాత, రూఫ్‌ లెవల్‌కు వెళ్లే పనులను పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ధరలు మరింత పెరిగితే ప్రభుత్వం అందించే సాయం సరిపోక, ఇళ్లను పూర్తిచేయడంలో మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

గ్రౌండింగ్‌కే పరిమితం

జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు అధికారుల ఒత్తిడి మేరకు గ్రౌండింగ్‌ చేసి వదిలేస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు, ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం మండలంలో 10,269 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,051 ఇళ్లు గ్రౌండింగ్‌, 847 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌ పూర్తి చేసుకోగా 103 ఇళ్లు రూఫ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి. మంజూరైన ఇళ్లలో కనీసం సగం కూడా గ్రౌండింగ్‌ కాకపోగా అయినవాటిలో బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఆగిపోతున్నాయి. దీంతో లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, హౌజింగ్‌ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు నిర్మించిన వారికి రూ.లక్ష చెల్లించగా, రూఫ్‌ లెవల్‌ పూర్తి చేస్తే రూ.1.25 లక్షలు, స్లాబ్‌ వేస్తే రూ.1.75 లక్షలు, పెయింటింగ్‌ పూర్తి చేసిన తరువాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం అందించనుందని చెబుతున్నా ఇంటినిర్మాణానికి అవి సరిపోవని ముందుకురావడంలేదని తెలుస్తోంది. నియోజకవర్గాల వారిగా బెల్లంపల్లిలో మాత్రమే కొంత మెరుగుకాగా చెన్నూరు పూర్తిగా వెనుకబడింది. మంచిర్యాల నియోజకవర్గానికి 3,280 ఇళ్లు మంజూరుకాగా గ్రౌండింగ్‌ 1661 కాగా, బేస్‌మెంట్‌ లెవల్‌లో 286, రూఫ్‌ లెవల్‌ వరకు 49 అయ్యాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో 3,164 ఇళ్లు మంజూరుకాగా గ్రౌండింగ్‌ అయినవి 1,726, బేస్‌మెంట్‌ లెవల్‌లో 362, రూఫ్‌ లెవల్‌ వరకు 35 అయ్యాయి. చెన్నూర్‌ నియోజకవర్గానికి 3,067 ఇళ్లను మంజూరు చేయగా గ్రౌండింగ్‌ అయినవి 1081 కాగా, బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉన్నవి 162, రూఫ్‌ లెవల్‌ వరకు 19 అయ్యాయి. ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి 758 ఇళ్లను మంజూరు చేయగా 583 గ్రౌండింగ్‌ అయ్యాయి, 37 బేస్‌మెంట్‌ లెవల్‌ పూర్తికాగా 4 రూఫ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి.

మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, చేపడుతున్న నిర్మాణాలు

మండలం మంజూరు గ్రౌండింగ్‌ బేస్‌మెంట్‌ లెవల్‌ రూఫ్‌ లెవల్‌

దండేపల్లి 692 514 116 22

హాజీపూర్‌ 447 329 73 4

లక్సెట్టిపేట 701 434 96 23

లక్సెట్టిపేట (మున్సిపాలిటీ) 214 36 0 0

మంచిర్యాల కార్పొరేషన్‌ 1,226 348 1 0

బెల్లంపల్లి 397 328 65 18

బెల్లంపల్లి (మున్సిపాలిటీ) 472 18 0 0

భీమిని 295 193 87 14

కన్నెపల్లి 303 175 63 1

కాసిపేట 464 233 30 2

నెన్నెల 465 277 43 0

తాండూర్‌ 495 308 36 0

వేమనపల్లి 273 194 38 0

భీమారం 432 115 37 0

చెన్నూర్‌ 821 377 32 2

చెన్నూర్‌ (మున్సిపాలిటీ) 140 4 0 0

జైపూర్‌ 636 296 57 13

కోటపల్లి 619 152 11 0

మందమర్రి 419 137 25 0

జన్నారం 758 583 37 4

మొత్తం 10,269 5,051 847 103

నిర్మాణాలు జరిగేలా చూస్తున్నాం

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు గ్రౌండింగ్‌ చేసేలా చూస్తున్నాం. పనులు ప్రారంభించిన వారికి విడతల వారీగా ఆర్థికసాయం అందిస్తూ నిర్మాణం పూర్తిచేసేలా చూస్తున్నాం. ఇప్పటికే పలువురు ఇంటి నిర్మాణాలను ప్రారంభించి, వేగంగా స్లాబ్‌ వరకు పూర్తి చేసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం సాయం వెంటనే అందించడంతో ఇతరులు సైతం ముందుకు వస్తున్నారు.

– బన్సీలాల్‌,

హౌజింగ్‌ పీడీ, మంచిర్యాల

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● ఆసక్తి చూపని లబ్ధ1
1/1

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● ఆసక్తి చూపని లబ్ధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement