
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ పట్టివేత
● 22న పోలీస్‌స్టేషన్‌లో వేలం
నేరడిగొండ: మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డీజిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 2,330 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో అదనపు కలెక్టర్ (పౌర సరఫరాలు) చర్యలు చేపట్టారు. పట్టుకున్న డీజిల్‌తో ప్రభుత్వానికి ఆదాయంగా మార్చేందుకు వేలం పాట ద్వారా విక్రయించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు నేరడిగొండ పోలీస్‌స్టేషన్‌లో వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎంఏ కలీమ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ ఓపెన్ వేలంలో పాల్గొనాలని కోరారు.