
ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సీఎంవో
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) కిరణ్‌రాజ్ సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి డిప్యూటీ సీఎంవో ప్రసన్నకుమార్‌తో కలిసి వార్డులన్నీ పరి శీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించి మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులు, కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. సంక్షేమాధికారి మాధర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.