
ముదిరాజ్‌లకు ఆర్థిక చేయూత అందించాలి
పాతమంచిర్యాల: ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మత్స్య సహకార సంఘాలు స్థాపించుకుని రెండు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేక ముదిరాజ్ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పండ్లు, చేపల అమ్మకాల ద్వారా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ మల్టీ స్టేట్ ఫిషరీస్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పులబోయిన భీమన్న, నాయకులు దామెర రాజయ్య, బోయపోతుల కొమురయ్య, ఉదరి ప్రతాప్ పాల్గొన్నారు.