
టీవైఎస్‌ఏ రాష్ట్ర సాంకేతిక కమిటీ సభ్యుడిగా రోహిత్
మంచిర్యాలటౌన్: తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్(టీవైఎస్‌ఏ) రాష్ట్ర సాంకేతిక కమిటీ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన రోహిత్ రెవెల్లిని ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల తిరుపతివర్మ, కార్యదర్శి మండ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సాధారణ సమావేశంలో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే యోగాకు సంబంధించి దేశంలో ఎక్కడైనా జడ్జిగా వ్యవహరించేందుకు అవసరమైన కోర్సును పూర్తి చేసిన రోహిత్‌కు రాష్ట్ర అసోసియేషన్‌లో చోటు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.