
2022–23 సంవత్సరానికి జిల్లాలో జన్నారం మండలం దేవునిగూడ గ
● జిల్లాలో పల్లెల ప్రగతి నివేదిక సేకరణ ● ప్రత్యేక బృందాలతో వివరాల నమోదు ● పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ 2.0షురూ ● ఈసారైనా జిల్లా నుంచి అవార్డులు గెలిస్తే మేలు
పంచాయతీ అడ్వాన్స్‌మెంట్
ఇండెక్స్ 2.0 పోర్టల్
సమష్టి సమన్వయంతోనే..
జిల్లాలో పలు పంచాయతీలు అభివృద్ధి పథంలో ఉన్నాయి. అక్కడి ప్రజాప్రతినిధులు, స్థానికుల సహకారం, అధికారుల చొరవ, తదితర కారణాలతో వృద్ధిలోకి వెళ్తున్నాయి. ఎంపిక చేసిన గ్రామాలు కేంద్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించలేకపోతున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎంపిక చేసిన థీమ్స్‌లో ప్రతిభ కనబర్చుతున్నాయి. ప్రగతి నివేదనలో ఆయా కారణాలతో తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీల్లో ఉత్తమ ర్యాంకుల ప్రదర్శన కోసం అధికారులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో కొందరు నిధుల లేమితోనూ ఉత్తమ పంచాయతీ కోసం పోటీ పడలేక ప్రాథమిక దశలోనే వదిలి వేస్తున్నారు. అలా కాకుండా అధికారులు ఈసారి పోటీల్లో జాతీయ స్థాయిలో అవార్డులు దక్కేలా కృషి చేస్తే జిల్లాకు మరింత పేరు వచ్చే అవకాశం ఉంది.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధికి పట్టు కొమ్మలుగా భావించే పల్లెలు అభివృద్ధి సూచీలో వెనుకబడుతున్నాయి. జిల్లా పంచాయతీలు జాతీయ స్థాయిలో పలు అంశాల్లో పోటీ పడలేక చతికిల పడుతున్నాయి. ఏటా ఉత్తమ పంచాయతీల జాబి తాకు జిల్లా నుంచి ఒక్కటీ ఎంపిక కాకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో పంచాయతీలకు గుర్తింపుతోపాటు ప్రోత్సాహక నగదు మొదటి ర్యాంకుకు రూ.కోటి పొందవచ్చు. రూ.75లక్షలు, రూ.50లక్షలు, రూ.25లక్షలు వరకు ర్యాంకు ఆధారంగా లభిస్తుంది. చాలా పంచాయతీల్లో అధికార యంత్రాంగం శ్రద్ధ చూపకపోవడంతోనూ ర్యాంకులు దూరమవుతున్నాయి.
మొదలైన డేటా సేకరణ
తాజాగా 2023–24 సంవత్సరానికి పంచాయతీ అడ్వాన్స్‌మెంటు ఇండెక్స్ 2.0 ఉత్తమ పంచాయతీ ఎంపిక కోసం డేటా సేకరణ మొదలైంది. 14శాఖలు వ్యవసాయ, పశుసంవర్థక, పౌరసరఫరాలు, విపత్తు నిర్వహణ, విద్యుత్, ప్రజారోగ్య, గృహ నిర్మాణ, సాగునీటి, పంచాయతీరాజ్, పోలీసు, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల నుంచి డేటా పాయింట్స్ కోసం సమాచారం తీసుకోనున్నారు. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో యంత్రాంగం ఆ మేరకు అన్ని వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. జిల్లాలో ఎక్కువ స్కోరు వచ్చిన పంచాయతీలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న 12,786గ్రామ పంచాయతీల్లో నుంచి జిల్లా పంచాయతీలు ఎంపిక కావాలి. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని పంచాయతీలు పోటీ పడి చివరకు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు వస్తే అవార్డు దక్కించుకునే అవకాశం ఉంది. స్కోరు వచ్చిన పంచాయతీల ప్రకారం ఏ ప్లస్ నుంచి ఏ, బీ, సీ, డీ వరకు వర్గీకరిస్తూ ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ డేటా సేకరణలో పొందుపర్చిన వివరాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా? లేవా? అని జిల్లా, రాష్ట్ర, కేంద్ర బృందాలు పరిశీలనకు వస్తాయి.
ఏడు థీమ్స్‌తో ఎంపిక
ఏడు థీమ్స్‌లో పంచాయతీలను ఎంపిక చేస్తారు. పేదరిక నిర్మూలన ఉపాధి మెరుగుదల, ఆరోగ్యం, తాగునీరు, పచ్చదనం పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక న్యాయం, భద్రత, స్వపరిపాలన, శిశు, మహిళా స్నేహపూర్వక పంచాయతీ లను డేటా ఆధారంగా ప్రగతి నివేదికను గుర్తిస్తారు.

2022–23 సంవత్సరానికి జిల్లాలో జన్నారం మండలం దేవునిగూడ గ