మంచిర్యాలఅర్బన్: ఎన్నో కష్టాలను అధిగమించి భాషా పండితుల పదోన్నతులకు కృషి చేసినట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రీయ ఉపాధ్యాయ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండితుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కోసం పడిన కష్టాలను వివరించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదీష్‌ను భాషా పండిత ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొండ శ్రీధర్‌స్వామి, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణచారి, గౌరవ అధ్యక్షుడిగా సంతోష్‌కుమార్‌శర్మ, కోశాధికారిగా శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షులుగా విశ్వప్రసాద్, నారాయణ, తిరుపతి, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీలత, సంయుక్త కార్యదర్శిగా రమేష్, సరేందర్, మహిళా కార్యదర్శులుగా యశోదలక్ష్మీ, నీల్‌కమల్, సాంస్కృతిక కార్యదర్శిగా శశికుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా మహేందర్‌రెడ్డి, శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.