
మొక్కలతో బంగారు భవిష్యత్
జైపూర్: మొక్కల పెంపకం, చక్కటి పర్యావరణం ద్వారా భవితరాలకు బంగారు భవిష్యత్ అందించవచ్చని సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పరిగెన్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఇందారం ఐకే–ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు ఆవరణలో బుధవారం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 500మెక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాది లక్షా 50వేల మొక్కలను 53హెక్టార్లలో నాటే దిశగా ముందుకెళ్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రెటరీ బాజీసైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజీఎం బీభత్స, గనిప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, చిప్ప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.