
పెద్దగా చదువుకోకపోయినా..
సాత్నాల: భోరజ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన మునిగెల విఠల్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. తనకున్న బరువు, బాధ్యతలతో పైచదువులు కొనసాగించలేకపోయాడు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు శ్రీనివాస్, రెండోవాడు వినోద్. పిల్లలు ఉన్నత స్థానాల్లో చూడాలని తపించేవాడు. వారిని ప్రోత్సహించేవాడు. నాన్న కలను నెరవేర్చుతూ శ్రీనివాస్ జూనియర్ లెక్చరర్, వినోద్ డాక్టర్ అయ్యారు.
ప్రోత్సాహం వెలకట్టలేనిది
మా నాన్న బాల్యం నుంచే చదువు ప్రాముఖ్యత, మంచి తనం, మానవత్వం, విలువల గురించి మాకు నేర్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే లెక్చరర్ ఉద్యోగం సాధించి ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్నాను. నాన్న ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్న.
– మునిగల శ్రీనివాస్,
జూనియర్ లెక్చరర్
నాన్న చూపిన బాటలో నడుస్తా
మనం చదువుకున్న చదువు పదిమందికి ఉపయోగపడాలనేది నాన్న ఆశయం. ఆయ న చూపిన మార్గంలోనే కష్టపడి డాక్టరేట్ సాధించాను. పేద ప్రజలు, గ్రామస్తులకు ఉచిత వైద్యమందించాలనేది నాన్న కల. నాన్న చూపిన మార్గంలో నడుస్తూ చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం ఈ ఎస్‌ఐ రామచంద్రపురంలో పని చేస్తున్న.
– డాక్టర్ వినోద్,
ఎండీ జనరల్ మెడిసిన్

పెద్దగా చదువుకోకపోయినా..

పెద్దగా చదువుకోకపోయినా..