
పట్టుబట్టి.. కొలువు కొట్టాడు
● అసిస్టెంట్ కమాండెంట్‌గా అభినవ్‌వర్మ
దండేపల్లి: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు మండలంలోని నెల్కి వెంకటాపూర్‌కు చెందిన పెట్టెం అభినవ్‌వర్మ. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి లచ్చన్న ప్ర భుత్వ ఉపాధ్యాయుడు. అభినవ్‌వర్మ పదోతరగ తి వరకు మంచిర్యాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో చదివాడు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ ఐఐటీ జోదాపూర్‌లో పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గతంలో కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ లో ఉద్యోగం కోసం నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. యూపీఎస్సీ నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఉద్యోగానికి గతంలో ఒకసారి ప్రయత్నించి ఫెయిలయ్యాడు. అయినా ఏమాత్రం కుంగిపోకుండా ప ట్టువదలని విక్రమార్కుడిలా క ష్టపడ్డాడు. మళ్లీ కసితో చదివా డు. గతేడాది నోటిఫికేషన్ విడుదల కాగా ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ కనబరిచి క్వాలిఫై అయ్యాడు. ఫిజి కల్ ఫిట్‌నెస్, మెడికల్, ఇంట ర్వ్యూ అన్నింటా పాస్‌కావడంతో 138వ ర్యాంక్ సాధించి సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ ఉ ద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబీకులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, పలువురు అతడిని అభినందించారు.