
రక్తదానం.. ప్రాణదానం
ఇప్పటివరకు 46సార్లు..
పాతమంచిర్యాల: నాది ఏబీ నెగెటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 46సార్లు రక్తదానం చేశాను. కలెక్టర్లు, గవర్నర్ ద్వారా ప్రశంసాపత్రాలు అందుకున్నాను. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాను. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో నిల్వలు ఉండేలా కృషి చేస్తున్నాను. రక్తదాతలకు ప్రమాద భీమా పాలసీ అందజేస్తున్నాం.
– మధుసూధన్‌రెడ్డి, లయన్స్
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి
ఎవరు ఫోన్ చేసినా వెళ్తా..
పాతమంచిర్యాల: నాకు రక్తదానంపై అవగాహన ఉంది. ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేశా ను. 10 సార్లు ప్లేట్‌లెట్‌లు దానం చేశా ను. నాది ఏ నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరు ఫోన్ చేసినా వెళ్లి రక్తం ఇస్తున్నాను.
– మహ్మద్ మజార్,
జాఫర్‌నగర్, మంచిర్యాల
● ఆపదలో ‘సామాజిక’ నేస్తాల అండ ● ప్రత్యేక గ్రూపుల ద్వారా బాధితులకు భరోసా ● ప్రాణదాతలుగా నిలుస్తున్న యువత ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
పాతమంచిర్యాల/ఆసిఫాబాద్‌అర్బన్/నిర్మల్‌ఖిల్లా: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాల్లో వైద్యులు ఒకరి నుంచి రక్తాన్ని సేకరించి మరొకరికి ఎక్కించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు. సికిల్‌సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీవారం లేదా ప్రతీ నెల క్రమంతప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. అలాంటి వారికి రక్తదాతలు నిజంగా ప్రాణదాతలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు తమ రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు నిలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఉమ్మడి జిల్లాలో సేవలు ఇలా..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ ఇంటర్నేషనల్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు కొ ద్ది సంవత్సరాలుగా రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వాస్పత్రుల్లోని గర్భిణులు, వివిధ ప్ర మాదాల బాధితులకు అందిస్తున్నారు. అలాగే కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొన్ని స్వ చ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే శిబిరాల్లో యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తూ పలు వురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతీ శిబిరంలో తప్పనిసరిగా 20నుంచి 50 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రక్తదానం ఆవశ్యకతను మరో నలుగురికి తెలియజేయాలనే సంకల్పంతోనే పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా బాధితులకు చేరువవుతున్నారు. నిర్మల్ జి ల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్ర మోద్‌కుమార్, బైంసా పట్టణానికి చెందిన యోగేశ్ రక్త గ్రూపుల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ‘ప్రేరణ యువసేన’ పేరిట బాధితులకు రక్తాన్ని స మకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలకేంద్రానికి చెందిన మునిగెల శ్రీధర్ శుద్ధోధన్, శ్రీనివా స్, నిర్మల్ జిల్లాకు చెందిన కొప్పుల నవీన్, సాగర్ తదితరులు ‘జైహింద్’ గ్రూపును 2018లో ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా రక్తదానం చేసినట్లు వీరు తెలిపారు.
ఎవరు రక్తదానం చేయొచ్చంటే..
ఆరోగ్యవంతులుగా ఉన్న 18–60 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నా రు. అయితే.. దీర్ఘకాలిక వ్యాధులు, హెచ్‌ఐవీ, రక్తపోటు, హైపటైటీస్ ఉన్నవారు రక్తదానం చేయరా దని పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి రక్తదానం చేసిన తర్వాత తిరిగి మూడు నెలలకు మళ్లీ రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని పేర్కొంటున్నారు. రక్తదానం చేసే సమయంలో ఇతర వ్యాధులు సోకుతాయనే మాటల్లో నిజం లేదని తెలిపారు. అవన్నీ అపోహలేనని చెబుతున్నారు. రక్తదానం ప్రాణదా నంతో సమానమని, పైగా రక్తదానం చేస్తే శరీరంలో ని అవయవాలు సక్రమంగా పనిచేయడంతో పాటు రక్తం శుద్ధి అవుతుందని సూచిస్తున్నారు.
అత్యవసరాల్లో తప్పకుండా చేస్తా
పాతమంచిర్యాల: నాది ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం. అత్యవసర సమయాల్లో ఏ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వెళ్లి రక్తదానం చేస్తున్నాను. రక్తం అవసరమైనపుడు బ్లడ్‌బ్యాంక్ వారు సమాచారమిచ్చినా వెంటనే వెళ్లి రక్తం ఇస్తున్నాను.
– నంది రాజేంద్రప్రసాద్, ఇటిక్యాల
25 ఏళ్లుగా ఇస్తున్న
పాతమంచిర్యాల: నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 80 సార్లు రక్తదానం చేశాను. పుట్టినరోజు, అయ్యప్ప దీక్ష తీసుకునే రోజు తప్పనిసరిగా రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తం ఇస్తాను. నా స్నేహితులతో కూడా రక్తదానం చేయిస్తున్నాను. రక్తదానం.. మహాదానం.
– పెద్దపల్లి లక్ష్మీకాంత్
పదేళ్లుగా సేవలో..
పాతమంచిర్యాల: పదేళ్లుగా రక్తదా నంపై అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు 2,600 మందికి రక్తదానం చేయించా ను. అత్యవసర వేళల్లో దాతలను పిలిపించి రక్తం ఇప్పిస్తున్నాను.
– అబ్దుల్ రహీం, రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ, మంచిర్యాల
సేవలోనే సంతృప్తి
భైంసాటౌన్: ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని భావించాం. ఇందుకు ఐక్య త సేవాసమితి గ్రూపును ఏర్పాటు చేశాం. రక్తదానం చేస్తున్నాం. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తం అవసరమైన వారికి వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నాం.
– యోగేశ్, ఐక్యత సేవాసమితి అడ్మిన్, భైంసా
వెంటనే స్పందిస్తాం
భైంసాటౌన్: బ్లడ్ డోనర్ గ్రూప్ ద్వారా అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నాం. రక్తం అవసరమని గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వెంటనే స్పందిస్తాం. ఇప్పటివరకు వందలాదిమందికి గ్రూపులోని సభ్యులు రక్తదానం చేశారు. ఇలాగే సేవలను కొనసాగిస్తాం.
– సురేశ్, బ్లడ్ డోనర్ గ్రూప్ అడ్మిన్, భైంసా
100 సార్లు ఇవ్వడమే నా లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్: నేను ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశాను. 100 సార్లు రక్తం ఇవ్వాలన్నదే నా లక్ష్యం. రక్తదానంపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు నిలపడం ఎంతో సంతృప్తినిస్తుంది.
– ఎండీ మొయినొద్దీన్, ఆసిఫాబాద్
40 సార్లు చేశాను
ఆసిఫాబాద్‌అర్బన్: ఇప్పటివరకు నేను 40 సార్లు రక్తదానం చేశాను. 16 ఏళ్లుగా రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. రక్తాన్ని దానం చేయడం అదృష్టంగా భావిస్తాను.
– వైరాగడే ప్రతాప్, ఆసిఫాబాద్
రక్తదాతలను ప్రోత్సహిస్తా
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌కు దాతలతో వెయ్యి యూనిట్ల రక్తం ఇప్పించాను. అత్యవసర సమయాల్లో ఎంతోమందిని ఆదుకున్నాను. నేను 10 సార్లు రక్తదానం చేశాను. ఎవరికైనా రక్తం అవసరమైతే 8639434390 నంబర్‌లో సంప్రదించాలి.
– మాడిశెట్టి ప్రశాంత్, సామాజిక కార్యకర్త
రక్తదాన దినోత్సవ నేపథ్యం
1901లో ఆస్ట్రేలియాకు చెంది న నోబెల్ విజేత కార్ల్ లాండ్‌స్టీనర్ మొదటిసారిగా ర క్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ప్రపంచ రక్తదాత ల దినోత్సవాన్ని ఏటా జూన్ 14వ తేదీన నిర్వహిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపం చ దేశాలు జూన్ 14వ తేదీన రక్తదాన దినోత్సవాన్ని 2004నుంచి నిర్వహిస్తున్నాయి.

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం