
కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి
బాసర: విద్యార్థులకు తమ ప్రసంగాల్లో పదాలు, వాక్యాల నిర్మాణంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతగానో అవసరమని ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సూచించారు. ఇంగ్లిష్ విభాగం, ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు, అధికారులకు వివిధ సందర్భాల్లో సరైన భాష, వ్యాకరణం, శైలి, ఫార్మాట్ లోపం లేకుండా లేఖలు రాయడానికి ఉపయోగపడే లేఖ నమూనాలను రూపొందించి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ.. నమూనా లేఖలు స్టూడెంట్ హబ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటి ఆధారంగా విద్యార్థులు, అధికారులకు వివిధ అవసరాల కోసం సరైన రూపంలో, నిష్పాక్షికంగా లేఖలు తయారు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, ఇంగ్లిష్ విభాగాధిపతి శ్రీఅప్సింగర్ విజయ్‌కుమార్, ఇంగ్లిష్ విభాగ అధ్యాపకులు, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.