● వందల ఫీట్లు బోర్లు ● విరివిగా వాటర్‌ప్లాంట్లు ● కొన్న
ఓ వాటర్ ప్లాంటు నుంచి
తరలిస్తున్న వాటర్ క్యాన్లు
జిల్లా కేంద్రంలోని ఓ గల్లీలో పేరు లేని వాటర్ ప్లాంటు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో స్వచ్ఛ నీటి పేరిట వ్యాపారం జోరుగా సాగుతోంది. వందల ఫీట్లు బోర్లు వేస్తూ లక్షల లీటర్ల నీటిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్న ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్ల సంఖ్య పెరిగిపోతోంది. భూగర్భ జల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బోర్లు వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 19 వాటర్‌ప్లాంట్లకు అనుమతి తీసుకోగా.. వందల సంఖ్యలో ఎలాంటి అనుమతి లే కుండా నిర్వహిస్తున్నారు. జిల్లాలో అనుమతి లేని వాటర్‌ప్లాంట్లతోపాటు ఇటుక బట్టీలు, సిని మా థియేటర్లు, తదితర వ్యాపార సంస్థలకు 235 నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అసలే పాటించడం లేదు. శుభ్రత, స్వచ్ఛత పట్టించుకో వడం లేదు. డబ్బులు తీసుకోవడం, వాటర్ క్యాన్ నింపడం అన్న చందంగా మారింది. ఏళ్ల తరబడి ట్రేడ్ ఫుడ్ లైసెన్స్ లేకుండానే విరివిగా నీళ్ల వ్యాపా రం సాగిస్తున్నారు. ఇళ్ల మధ్యనే 500 నుంచి వెయ్యి ఫీట్ల వరకు బోర్లు వేయించి నీటిని తోడేస్తున్నారు. ఓ వైపు వేసవి కాలం భూగర్భ జలాలు పా తాళానికి పడిపోతున్నాయి. గృహావసరాలకు విని యోగించే బోర్లకు నీరందని పరిస్థితి నెలకొందని పలు చోట్ల కాలనీ వాసులు వాపోతున్నారు.
ఇంటింటికీ క్యాన్లు
పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ గల్లీకో వాటర్‌ప్లాంటు ఏర్పాటవుతోంది. ఇంటింటికీ గోదావరి నీ రు, మిషన్ భగీరథ నీరు వస్తున్నా శుభ్రత, శుద్ధమై న నీరు లేక తాగడానికి జిల్లా వాసులు ఇష్టపడడం లేదు. దీంతో వాటర్‌ప్లాంట్ల నుంచి మినరల్ వాటర్ క్యాన్లు తెప్పించుకుంటున్నారు. 20లీటర్ల క్యాన్‌కు రూ.15నుంచి రూ.20 చెల్లిస్తున్నారు. గృహావసరాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షా పింగ్‌మాల్, హోటళ్లు, షోరూంలు, ఆస్పత్రి, చిరువ్యాపార దుకాణాలు తదితర వ్యాపార సంస్థలకు నెలవారీ ఖాతా లెక్కన నీటి క్యాన్లు అందిస్తున్నారు. దీంతోపాటు ప్యాకింగ్ వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ రూపకంగా సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు శుభకార్యాలకు కూల్ క్యాన్ రూ.30 నుంచి రూ.40 చొప్పున వాహనాల్లో సరఫరా చేస్తున్నారు. గల్లీల్లో కొనసాగుతున్న ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్లకు పేరు, ఊరు ఉండడం లేదు. కనీస నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం లేదు. మురుగు నీటి కాలువల పక్కనే వాటర్‌క్యాన్లు నింపుతున్నారు. వాటర్‌ప్లాంట్లు, స్టీల్‌పైపులు, ట్యాంకులు, వినియోగించే క్యాన్లు శుభ్రపర్చడం లేదు. కొన్ని వాటర్‌ప్లాంట్లలో ప్లాస్టిక్ సింథటిక్ ట్యాంకులు వినియోగిస్తున్నారు. కొందరు నేరుగా బోరు నీటిని ట్యాంకుల్లోకి పంపింగ్ చేస్తున్నారు. భూగర్భ జల శాఖ నుంచి ఎన్‌వోసీ లేకుండా వాటర్‌ప్లాంట్లు కొనసాగిస్తున్నారు. భూగర్భ జలాలను విరివిగా వినియోగించకుండా వాల్టా చట్టం–2004 కఠినంగా అమలు చేసేందుకు గత ప్రభుత్వం 2023 మే 27న జీవో నంబరు 15 తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యవసాయ, గృహ అవసరాలకు వేసిన బోర్లకు కాకుండా పరిశ్రమలు, ఇతర వాణిజ్య, వ్యాపారంగా బోర్లు వేసి నీటిని వాడుతుంటే తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌వోసీ) తీసుకోవాలనే నిబంధన విధించింది. భూగర్భ జలశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్లాంట్లకు ఎన్‌వోసీ తీసుకోవాలని నోటీసులు ఇస్తుండగా.. ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించి ఒత్తిడి తీసుకొస్తున్నారని అధికారులు వాపోతున్నారు.
తప్పనిసరి అనుమతి తీసుకోవాలి
వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలు వినియోగించుకునే వారు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి అవసరాలు, వ్యవసాయ రంగ బోర్లకు స్థానిక మండల కార్యాలయం, మున్సిపాలిటీలో అనుమతి తీసుకోవాలి. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు. జీవో నంబరు 15 ప్రకారం వాటర్‌ప్లాంట్లు, ఆసుపత్రులు, అపార్టుమెంట్లు, షాపింగ్‌మాల్స్, ఇటుకబట్టీలు, సర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాల రంగాల బోర్లు వినియోగించుకునే వారు భూగర్భజలశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రూ.14,500 నుంచి రూ. 19,500 వరకు చెల్లించి ఎన్‌వోసీ తీసుకోవా లి. వెయ్యి లీటర్లకు గాను రోజు రూ.1 చొ ప్పున చెల్లించాలి. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం.
– శ్రీనివాస్‌బాబు, జిల్లా భూగర్భజల
శాఖ అధికారి
ఎన్‌వోసీ చెల్లింపు ఇలా..
పరిశ్రమలు, ఇతరత్రా వాణిజ్య అవసరాలకు తీసుకునే ఎన్‌వోసీలు పలు కేటగిరీల ప్రకారం ఇస్తున్నారు. వాటి గడువు ముగిసిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రిటికల్ అండ్ సెమిక్రిటికల్ అండ్ సేఫ్ విభాగంలో ఉత్పాదక పరిశ్రమల్లో తాగడానికి ఇచ్చే ఎన్‌వోసీ ఐదేళ్ల వరకు, పరిశ్రమలు, బల్క్ వాటర్ సప్లయ్, ప్యాకేజ్, డ్రింకింగ్ సప్లయ్ చేసే వాళ్లకు మూడేళ్ల వరకు, ఇతరత్రా అవసరాలకు ఎన్‌వోసీ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత నిర్ణీత రుసుం చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలి. ఉత్పాదక పరిశ్రమలకు కొత్తగా ఎన్‌వోసీ పొందాలనుకునే వారు రూ.10 వేలు, రెన్యూవల్ చేసుకునేటప్పుడు రూ.5 వేలు చెల్లించాలి. పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు వాటర్‌ప్లాంట్లకు నెలకు 25 వేల లీటర్ల నీటి వాడకానికి రూ.14,500, ఆపై రూ.50 వేల లీటర్ల నీటి వాడకానికి రూ.18 వేలు, ఆపై లక్ష లీటర్ల నీటి వాడకానికి రూ.32 వేలు, లక్షకు పైగా లీటర్ల నీటిని వినియోగించుకునే వాటర్ ప్లాంట్లు రూ.42 వేలు చెల్లించాల్సి ఉంటుంది.


